Friday, October 2, 2015

కోర్ట్ లో ఏముంది ..?

కోర్ట్ ...

ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మరాఠీ చిత్రం పేరు ఇది ...

ఉత్తరాదిన   పి కే, మెరికొమ్  దక్షిణాదిన బాహుబలి లాంటి హై బడ్జెట్ చిత్రాలని తోసి రాజని ఉత్తమ జాతీయ చలనచిత్రం అవార్డు అందుకోవడమే కాకుండా మన ఇండియా తరపు నుండి ఆస్కార్ బరిలో ప్రవేశించిన ఒక సామాన్య మరాటి లో బడ్జెట్ చిత్రం "కోర్ట్"  ..

చైతన్య తమ్హనీ దర్శకత్వం లో  రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రసంసలు పొందింది. ఇది అతనికి మొదటి చిత్రం .
హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం లో అసలు అంతగా ఏముందా అని ఈ చిత్రం చూడటం జరిగింది

ఒక సాధారణ  వినోద భరిత చిత్రం లో ఉన్న అంశాలు ఏవి ఇందులో లెకపొయిన మన మేధావులు ఈ చిత్రాని ఆస్కార్  బరి లోకి పంపడం 
సృజనత్మతకు  పట్టం కట్టే  ఒక అరుదైన ప్రయత్నమ్ .. ఇక ఈ కోర్ట్ లో ఏముందో ఇపుడు చూదాం .. 

కథ :  నారాయణ్ కంబ్లె అనే సోషలిస్ట్ తన కళా ప్రదర్శన లో తను రచించిన ఒక సామజిక గేయాన్ని ప్రదర్శిస్తున్నపుడు పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తారు .. కారణం అడగగా తను ఇంతకుముందు ప్రదర్శించిన  ఒక పాటకు ఒక యువకుడు ప్రభావితమై చనిపోయాడు అని చెప్తారు ... ఈ విషయమై తన మిద కేసు నమోదు చేశారని 
కోర్ట్ లో హాజరు కావాలని నాన్ బెయిల్ వారంట్ తో తిస్కేల్తారు పోలీసులు ..ఇక తర్వత సన్నివేశాలు అంత కోర్ట్ లో మొదలవ్తాయి .... క్లుప్తంగా కథ ఇదైన దర్శకుడ్ తను అనుసరించిన  స్క్రీన్ ప్లే ని మెచ్చుకుని తీరలి.. 

1. రియాలిటీ : 
చైతన్య తమ్హనీ ఈ కథను చాల రియాలిటి దగ్గరగా రాసుకోవడమే  కాకుండ అలనే  చిత్రం లో చూపాడు .. 
కోర్ట్ లో జరిగీ ప్రతి సన్నివేశము మన నిజ జీవితం లో జరిగీ కోర్ట్ సీన్ మాదిరిగానీ ఉంటాయి . మరియు లాయర్
జీవితం లోని రోజు జరిగీ సన్నీవేషాలను కూడా చూపడం జరిగింది .  కుటుంబంతో గడపడం ,కామెడీ షో కి వెళ్ళడం మరియు పబ్ లో  జరిగీ సీన్ ప్రతీది కూడా సహజత్వానికి దగ్గరగా ఉంది 

2. సినిమాటోగ్రఫీ:
ఈ చిత్రానికి అందించిన  సినిమాటోగ్రఫీ చాల బాగుంది  ప్రతీ సీన్ కూడ బాగుంది 

3. నిశ్శబ్దం :
ఈ చితరం ఇంతగా ఆకట్టుకోడానికి కారణం మాత్రం  నిశ్శబ్దం అని నిక్కచిగా చెప్పొచు.. ఎలాంటి ఆడంబరమైన సన్నివేశాలు లేకుండా రణగొణ ధ్వనులు లేకుండా తీయడం జరిగింది. ఇదీ ఈ చిత్రానికి ప్లస్సు అని చెప్పుకోవోచు 
4.. డ్రామా :
కథనం లో భాగం గా పాత్రధారుల మధ్య జరిగిన సన్నివేశాలు మాత్రం అద్భుతం .. ఎలాంటి భావోద్వేగాలు లేకపోయినా ఈ చిత్రం చేసిన మేజిక్ అంత ఇంత కాదు ...లాయర్ల మధ్య జరిగీ సాధారణ  వాదోపవదన .. ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పొచు .. 

 మొత్తానికి ఒక  నూతన దర్శకుడిగా తను తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని  ఆస్కార్ బారి లోకి దిగడం చెప్పుకోదగ్గ విషయం .. 












No comments:

Post a Comment