Friday, October 2, 2015

ఆదర్శ గ్రామం-ఈరవిపెరూర్(కేరళ )



ఊరు.. అవార్డుల జోరు!
("ఈ  ఊరు.. అవార్డుల జోరు!" పేరిట ప్రచురించిన ఈ కథనం నాకు చాల బాగా నచ్చింది ... ఈ కథనం నమస్తే తెలంగాణా పేపర్ లోనిది .... )

banana

డిజిటల్ ఇండియా నినాదంతో దేశమంతా కోడై కూస్తుంటే కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా ఈరవిపెరూర్ ఊర్లో వైఫై గురించి ఆ రాష్ట్రమంతా చర్చ జరుగుతుంది. వైఫై సౌకర్యం పొందుతున్న మొదటి గ్రామ పంచాయతీగా చరిత్రకెక్కుతున్నది ఆ ఈరవిపెరూర్. గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కిలోమీటర్ దూరం వరకు వచ్చేలా వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేశారు. వైఫై నెట్‌వర్క్ పరిధిలో కోజిమాల, వల్లంకులం, నన్నూర్ గ్రామాలు కూడా వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు ఐదు లక్షలు వెచ్చించారు. వైఫై ఒక్కటే కాదు.. ఈ గ్రామానికి ఇంకా కొన్ని స్పెషాలిటీలున్నాయి. అవేంటంటే...
- ఈరవిపెరూర్ 2015 సంవత్సరానికి గాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ అవార్డుకు ఎంపికయింది.
- గత మూడేళ్ల నుంచి ఎన్నో జాతీయ అవార్డులతో పాటు కేరళ శానిటేషన్ మిషన్ నుంచి శానిటేషన్ అవార్డు అందుకుంది.
- పోషకాహరంతో బాధపడుతున్న పేదపిల్లలకు ఉచిత పోషకాహరం అందిస్తున్న గ్రామంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2014-15 జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.
- టెక్నాలజీని వాడుతూ ప్రతి పథకాన్ని ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేయడం, గ్రామానికి సంబంధించిన అన్ని వివరాలను డిజిటల్‌గా పొందుపరుస్తున్నారు.
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినందుకు ఐఎస్‌ఓ-9001 సర్టిఫికేట్ కూడా వచ్చింది.
-ఉద్యానవన శాఖ ఎంపిక చేసే మోడల్ హైటెక్ గ్రీన్ విలేజ్‌గా కూడా ఎంపికైంది.

ఇలాంటి గ్రామాల అభివ్రుధిని అన్ని గ్రామాలు  ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుందో  కదూ .... 









No comments:

Post a Comment