:Attraction:(ఇట్స్
మై రియల్ స్టోరి)
***********************
“ఎట్రాక్షన్
అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి
తెలీదు..”
నేను
ఒకసారి రైలు లో ప్రయాణం
చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన..
ట్రైన్
రావడానికి ఇంకొద్ది సమయం మాత్రమె ఉంది..స్టేషన్ లొ ఏర్పాటుటు చేసిన
చైర్
లో కూర్చుని ట్రైన్ కోసం వైట్ చేస్తున్నాను.
ఇంతలో
ఒక అమ్మాయి నా ముందు వచ్చి
కూర్చుంది .. ఆ అమ్మాయి ఫేస్
లొ కాస్త
డల్ నెస్ కనిపించింది.. అంత
అందంగా ఏమి లేదు.. అలా
అని వరెస్ట్ గాను లేదు..
ఏదో తెలియని కాంతి ఆ అమ్మాయి
మొహం లో కనపడింది. జ్వరం
తో బాధపడ్తుంది కాబోలు ..
నేను
ఆ అమ్మాయి వైపె చూడ సాగాను..
మొదట్లో నా వైపు చూడకపొయిన
నేను 4,5 సార్లు చూసెసరికి
తనూ నా వైపు చూసింది..
నాకు కాస్త అమ్మాయిలంటే సిగ్గు
ఎక్కువ.. వెంటనే నేను ఆమె
వైపు
చూడనట్టుగ తల అలా పక్కకి
చేసి పెట్టాను... మల్లీ కాసెపైనాక .. మల్లి
చూసాను...
ఈసారి
నేను ఆమెకై పదె పదె
చూస్తున్న విషయం అర్థమైంది అనుకుంట...
నాకేసి కొంచెం
సీరియస్
గ చూసింది.. కాసెపట్లో ట్రైన్ వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కిన
తర్వత నేను
ఎక్కాను..
ఆమె తో పాటూ ఒక
అబ్బాయి ఉన్నాడు .. అతను ఆమె తమ్ముడు
అని తర్వాత తెలిసింది. ట్రైన్ లొ
చాల జనం ఉండె సరికి
ఆమె నిల్చుంది. నేను విండో దగ్గర
నిల్చొని ఆ అమ్మాయి వైపే
చూస్తున్నాను.
అప్పటికె ఆ అమ్మాయి జ్వరం
తో భాదపడుతు.. ఈ కర్మ ఎంట్రా
బాబు.. అన్నట్లుగ
ఫీల్
ఔతుంది. అసలే జ్వరం అందులొ
నిలబడి ఉంది.. ట్రైన్ నిండా ఫుల్ జనం
.. నాకు ఆ అమ్మయిని చూసి
చాలా
బాధ వేసింది.. దేవుడా నాకు సీట్ దొరక్కపోయిన
ఫర్లేదు ఆ అమ్మాయికి మాత్రం
దొరికేల
చెయ్
అని వేడుకున్నాను.. నేను ఆ అమ్మాయికి
సరిగ్గా 3 అడుగుల దూరం లో ఉన్నాను..
అదెంటో
నా కోరికను దేవుడు మన్నించాడు అనిపించింది .. వెంటనె ఆ అమ్మాయికి సీట్
దొరికింది..
హమ్మయ్య!!
అనుకుని దేవుడికి థాంక్స్ చెప్పాను.కూర్చున్నాక ఆ అమ్మాయి నాకేసి
చూసింది..
సీట్
దొరికినందుకు ఆమె కంటె నా
ఆనందమె ఎక్కువ అయ్యింది ..నా వైపు చిన్న
స్మైల్
విసిరింది..
అల ట్రైన్ లొ నా ప్రయాణం
జరుగుతూ ఉండగా.. నేను మల్లీ ఆ
దేవుడిని
వేడుకుంటానని
ఆ దేవుడు కూడ ఊహించి ఉండడు..
ఆమె పక్కన ఓ బండోడు
కూర్చున్నాడు
వాడు మాటికి మాటికి ఆమె మీద పడుతున్నాడు..
దేవుడ!! ఇలాంటివాల్లను
భూమ్మీద
ఎందుకు పుట్టించావు!! అని అనుకున్నాను... వెంటనే
అతన్ని అక్కడి నుండి లేపు!
అని మల్లీ నా దెవుడిని
వేడుకోవటం మొదలెట్టాను .. ఈ సారి మాత్రం
దేవుడు
కరునించడానికి
కొంత సమయం పట్టింది... ప్రతీ
ఐదు నిమిషాలకు అలా అమ్మాయి
వైపు
చూడటం మొదలెట్టాను... ఆ అమ్మాయి నా
వైపు చూడకుండ ఉంటే నేను అంతగా
పట్టించుకునే వాన్ని కాదు.
కాని
ఆమె కూడ నేను చూసిన
వెంటనె నా వైపు చూడటం…!!
ఆ ఫీలింగ్!!
ఇప్పటికి
మర్చిపొలే కపొతున్నాను... బహుశా నేనలా చూడటం
ఆమెకి కూడా నచ్చేసింది కావచ్చు..,,నా వైపు అలా
పాజిటివ్ గా చూడటం వల్ల
అనుకుంటా నాలో తన వైపు
మల్లీ మల్లీ చూడాలనె కోరికను
రెట్టింపు చేసింది..
అలా నా ప్రయాణం లొ..
5 గంటల తర్వాత!!.. చాలా మంది
దిగిపొయారు..
ఇంకో 3 స్టేషన్ ల తర్వాత నా
స్టేషన్ .. కాని ఆ అమ్మాయి
ఎక్కడ దిగుతుందో
తెలీదే!
ఆ తర్వాత ..నేను ఆమె సీట్
కనపడెట్టుగ ముందు సీట్లొ కూర్చున్నాను..
. జనం అంతా
దిగిపోయెసరికి
తన లో ఉన్న జ్వరం
అలసట తగ్గిపొయాయి.. తన వాలిపొయిన జుట్టును
ఒక్కసరిగా
టైట్ గా కట్టేసి రబ్బర్
బ్యాండ్ పెట్టేసుకుందీ.. .. తను అలా నవ్వుతూ
తన తమ్ముడి తో ఆడుకుంటూ మద్యలో
నా వైపూ చూస్తూ ఉంది….
ఆ అమ్మయి మొహం లో కాంతి
,నా గుండెల్లో
గుబులు
రెండు స్టార్ట్ అవడం మొదలెట్టాయి... ఇపుడు
ఏ అమ్మయిలోను లేని అందం,ఆకర్షణ,ఆనందం
తన లో నాకు కనిపించాయి…!!!
నా భయం ఏంటంటె ఆ
అమ్మాయి ఎక్కడ దిగి పోతుందో
అని .. ఎలా రా దేవుడ??
అనె క్షణం లొ మల్లి
నా దేవుడు గుర్తొచ్చాడు. దేవుడా ప్లీస్..! ఆ అమ్మాయిని నేను
దిగే స్టేషన్ లో దింపమని ..! నాలో
ఆరాటం ,,ఆవేదన
మొదలయ్యయి...
నేను ఇలా ఒక అమ్మాయి
గురించి టెన్షన్ పడటం ఇదే తొలిసారి..!!
సమయం
గడుస్తున్న కొద్ది నాలో భాద మొదలయ్యింది..
విధి తన పని తాను
చేసుకపోతుంది
అంటారు
.. అలాగె జరిగింది.. తను దిగాల్సిన స్టేషన్
వచ్చేసింది.. తన తో గడిపిన
ఈ మధుర క్షణాలు.. ఎక్కడ
మటు మాయమైపోతాయో అని.. ఈ నిజం
ఎక్కడ భ్రమ ఆయిపొతుందో అని…
అలా తను దిగి వెల్లిపొతుండగా
చివరి
సారిగా చూసాను...
తనూ నా కేసి చూసింది...
ఆ ఫీలింగ్ ఇప్పటికి నా మనసులో చెరిగిపోకుండ
అలానే
ఇంకా
ఉంది.. అలా తన వెంటే
నా అడుగులు అనుకున్నాను. .అక్కడె దిగిపొదాం అనుకున్నాను... కాని ... నాది తర్వాత స్టేషన్
అవడం తొ... దిగలేకపొయాను. తనని
చాలా మిస్సయ్యాను అనిపించింది ..అలా అమ్మాయిని గుర్తుచేసుకుంటూ
మిగిలిన క్షణాలని గడిపాను.... ఇంకో గంటలో
నేను
కూడా ఇంటికి చేరుకున్నాను...
******************************
మూడు
రోజులు నిద్దుర పట్టలేదు అంటే నమ్మండి.!!. ఆమె
గురించే
అలోచనలు..
ఎక్కడుందో! ఎలా ఉందో...! ఎలాగైన
ఆ అమ్మాయి అడ్రస్స్ పట్టాలని!! ఆ ఊర్లొ ఉన్న
మా ఫ్రెండ్ కి చెప్పాను... నువ్వేం
భాదపడకుర నేను ట్రయ్ చేస్తా
అన్నాడు... కాని ఆమె దొరకడం
అసాధ్యం
అనిపించింది... అలా నా ఫీలింగ్స్…
ఆ మూడు రోజులు… నేను
ఎప్పటికి మర్చిపొలేను..
ఎక్కడున్నా
ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని అశిస్తూ.... ఆ దేవుడికే నా
భారమంత వదిలేసాను......
#########Scripted by
hari#############Thankyou#################
No comments:
Post a Comment