Sunday, December 22, 2013

నేను..నా మరదలు..

హైదరబాద్ బస్టాప్ లో మా వూరు వెల్లె బస్సు కోసం వేచి చూస్తున్న బస్సు అయిదు నిమిషాల్లోనె వచ్చింది.
కల్లలో అనందం, గుండెల్లో సంతోషం ..ఇవన్నీ బస్సును చూసి కాదండి !
ఎందుకనీ అంటే ఒక్కమాటలో చెప్పలేను. పదండీ బస్సులో వెళ్తూ చెప్తాను..!
కండక్టర్ నా దగ్గరకు వచ్చి  "ఎక్కడికి.." అన్నాడు.. "నా హ్రుదయం దగ్గరికి" అని చెబుదామనుకున్న .. ఫీలవు్తాడని చెప్పలేదు..
ఇక నా విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా నాలో ఆనందం గుండెల్లో ఉత్సాహం ఎదో తెలియని ఆరాటం..వీటన్నీటిని మిక్సి లో గిర గిరా  వేసి త్రిప్పినట్లుగా నాలో అలోచనలు
నా మదిలో కదలాడుతూనే ఉన్నయి.. ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నాననంటె దానికో కారణం ఉంది. తొందరెందుకు మెల్లిగా చెబుతాను పదండీ..!


అనగనగా అమాయకపు  బావ..ఆ బావకి అల్ల్లరి ముద్దుల మరదలు..ముద్దుల మరదలైతే అన్నాను కాని ..ఇంతవరకు ఒక్క ముద్దూ లేదు. ఆ అమాయకపు బావని నేనే...
నా అల్లరి మరదలు పూజ..స్వయాన నా అత్త కూతురు... ఇక నా మరదలి గురించి చెప్పాలంటె ముందుగా తనని పరిచయం చేయాలి. మీకు , తనని పరిచయం చేసే రైట్స్ నాకైతె ఇవ్వలేదు..
అందుకె తన పరిచయం  తన మాటల్లోనె ..
హాయ్ ఫ్రెండ్స్ .. నేను పూజ.. నా బావకి ఒక్క గానొక్క ముద్దుల మరదలిని .. నాకు చదువంటే చాల ఇష్టం. ఎం.బి.బి.ఎస్ చేసి డాక్టర్ కావాలనేది నా కోరిక  అది మా తాత గారి కోరిక కూడా..కాని టెంత్ ఫేల్ అవడంతో మా తాతకి గుండే పోటొచింది 
దాంతో ఆయన గుర్రమెక్కారు..నేనేమో నాక్కావలసిన గుర్రం కోసం వెదుకుతున్నాను..ఇంతలోనే దొరికే్సాడు నా బావ. బావేమో చేప పిల్లలా అమాయకుడు.. !మరి నేనేమోం చేపలకి వల వేసె టైపు ! కాని నా బావంటే నాకు
చాల ఇష్టం. నాకంటే చాలా మంచివాడు.నా కోసం ఎదైన చేస్తాడు. అన్నట్లు ఇక నేను చదుకోవాలి..ఎందుకంటె నేను చాల సంవత్సరాల తర్వాత మల్లి టెంత్ పరిక్ష రాస్తునాను..ఉంటాను..మరి ..ఒవర్ టు మై బావ...


అదండీ విన్నారుగా అదీ నా మరదలు. అద్దానికే మేకప్ వేసె టైపు అన్నమాట..!
తన కి పవన్ కల్యాణ్ అంటే పిచ్చి.. ఎంతలా అంటే ఒకరోజు గబ్బర్ సింగ్ సినిమా కి ఉదయాన్నే వెల్లాము..టికెట్లు దొరకకపొయేసరికి అక్కడో పెద్ద గొ్డవ చేసి మొత్తనికీ టికె్ట్లని సాదించింది.
ఇలాంటి మంచి లక్షణాలు చాలానే ఉన్నాయి నా మరదలికి ..

అరె చూసారా తన గురించి చెప్పేలేపే సగం దూరం వచ్చేసింది..
----       -------    
ఇంకా నా మరదలి విషయాల్లోకెలితే ..
ఆ రోజు తను తొమ్మిదో సారి పదో క్లాసు ఎక్జాంస్ రాస్తుంది ,,ఆ రోజు ఇద్దరం కలిసి బయల్దేరాం ..

హలో పూజా మేడం గారు..ఈ సారైనా తమరు పది  గట్టెక్కితే  తిరుపతికెల్లి గుండు కొ్ట్టించుకుంటానని మొక్కు కున్నానే ..
దీనికి నా మరదలు.. గుండుదేముంది బావ ఎప్పుడు కావలంటే అప్పుడు కొట్ట్టించుకోవచ్చు..పదవ తరగతి పాసవడమంటే అంతా ఈజీ అనుకున్నావా...బావా..
నువ్వు తప్ప అందరూ పాసయ్యారే..మన క్లాసులో..
చూడు బావ అని చెప్ప బోతుంది..
నువ్వు చెప్పే సోదేదో ఆ పేపర్ లో రాయి... ఈ సారైనా పాసవవే నీకు దండం పెడతా గాని...
ఎందుకు బావ నేనంటే అంత ప్రేమ నీకు..
నేను తన వైపు సీరియస్ గా చూసే లోపె..
కూల్ బావా కూల్ !స్మైల్ !స్మైల్ ! అంటూ ప్రభాస్ లా నన్ను హాట్ చేసి వెల్లింది..

ఎగ్జామ్ అయిపొయింది అందరూ వస్తున్నారు నా మరదలు రాదేం ఇంకా అని అనుకుంటుండగానే ఎదో తెలియని డల్ ఫేస్ తో వస్తుంది.
ఎంటే అలా ఉన్నవ్ కొంపతీసి బాగా రాసావా ఎంటీ .. అన్నాను
నేను పాసై పోతానని కుల్లు బావ నీకు..,అయినా నేనందుకు కాదు విచారించేది..నేను ఎలాగోలా పాసై పొతాను గాని నీ గురించే అంతా నా వర్రీ ..అదే బావ మన పెల్లి సంగతి..
హుమ్....అపుడే పెల్లి గురించి అలోచిస్తున్నవా...చేసుకుందామే...దానికి అప్పుడే అంత తొందర ఏమి వచింది చెప్పు...
అదీ, బావ నాకు కారులో నచ్చిన ప్రదేశాలన్నీ తిరగాలని ఉంది. అలా తిరగాలంటె ముందు మనం పెల్లి చేసుకొవాలి గా..
అవునే నేను ముందే అనుకున్నాను.నువ్వు ఇలంటిదేదో ఫిట్టింగ్ పెదతావని .అయినా సైకిల్ కొనుక్కోడానికే దిక్కు లేదు మనకి యింకా కారు గురించి అలోచిస్తుంది చూడు మహా రాణి..
పో బావ నేనంటె నీకెప్పుడూ జొకే ...

----       ---------
తను ఎగ్జామ్ అయిన మరుసటి రోజు మా పెళ్ళి మ్యాటర్ గురించి ఇంట్లో అడిగాం ....
అంతా ఒకే కాని మావయ్య ఒక కండిషన్ పెట్టాడు..గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్ళి చేస్తా అన్నడు..
ఆ రోజు మావయ్య తో చాలా సేపు వాదించాను.. అందర్నీ వదిలేసి  ఉద్యోగం కోసమని సిటీ వెళ్ళాలని తీసుకుని బయల్దేరటానికి బస్ స్టాప్ లో సిద్దంగా ఉన్నాను..పూజ కూడ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచింది..

ఎంటి బావ ఫైనల్ గా వెళ్ళాలనే నిశ్చ్యించుకున్నావా...నిజంగానే వెల్లిపొతున్నవా..
లేదె...ఉత్తిత్తినే ...అలా వెల్లి సిటీ అంత చుట్టేసి మల్లి వస్తానే....
అయ్య బాబోయ్ చూడండి  మా బావకి ఎంత కోపమో...
లేక పోతె ఏంటి పూజ నిన్న మీ నాన్న అన్న మాటలకి ఎంత కోపం వచ్చిందో తెలుసా...
మా నాన్న చెప్పింది కూడా మన మంచికే గా...
ఏంటి మంచి ,,మంచి మంచి నీల్ల్ల లా ఉండాలి... ఇలా బురద నీల్లలా కాదు...గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది చెప్పు..
అందుకే వెల్తున్నాను..నాకు జాబు వద్దు ,నువ్వు వద్దు ! అని అనేసాను తనతో...

అంటే నను వదిలేస్తావ...చూడు బావ నేను ఫెవిక్విక్ లాంటి దాన్ని..  అంత తొందరగా నీ మనసు నుండి వెల్తానని నేను అనుకొవడం లేదు అది నీ వల్ల అయితె నువ్వు వెల్లు అంది ..
చూడు బావ బ్రతకాలంటే ఎన్నో మార్గాలునాయి..కాని మనకి లైఫ్ కి సెక్యూరిటీ,సుఖం ఇచ్చేది మాత్రం ఆ గవర్నమెంట్ జాబే అని నా ఫీలింగ్ ..నువ్వు నీ కోపాన్ని ఒక వంతు నీ లక్షం మీద పెడితే అదంత పెద్ద కస్టమేం కాదు...
నీకోసం నేను ఎన్ని రోజులయిన వేచి చూస్తాను...అని చెప్పి వెల్లిపొయింది..
నా మరదలు చెప్పిన మాటలు ముందు కవిత్వం లా అనిపించిన .. తరవాత నిజమని తెలిసాయి..
అలా సిటీ కి వచ్చి మూడు సంవ్త్సరాలు గడిచాయి..

ఈరోజున నా కల నెరవేరింది ..సెక్షన్ ఆఫీసర్ గా మా వూరిలోనె పోస్టింగ్ ..మూడు సంవ్త్సరాల తర్వాత..మళ్ళి  నా మరదలిని చూడబోతునాను... నా పోస్టింగ్ లెటర్ ని మావయ్య చేతిలో పెట్టి నా చేతులతో నా మరదలిని తీసుకెల్లలని నా కోరిక..

చూసార. మాటాల్లో పడే సరికి మా వూరే వచ్చేసింది ...ఇక ఆలస్యం చేయకుండా ముందు నా మరదలి ఇంటి వైపే నా అడుగులు ముందుకు సాగాయి...

అలా నడుస్తూ ఉంటే మద్యలో ..ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఒక జంట నా ముందు కనపడింది.. దగ్గరికి వెల్లి చూసాకా షాక్ తిన్నాను..అక్కడ ఉంది నా మరదలే అని నేను ఊహించలేక పోయాను..
తను  అతన్ని అక్కడే ఉంచి నా వైపు వస్తూ ..
హాయ్ బావా...ఎలా వున్నావ్ అంటూ..పిలిచింది.. తను నా దగ్గరికి వచ్చాక ..
ఏంటేఅసలేం జరుగుతుందే అని అన్నాను..
సారీ బావ ... నువ్వు ఇక రావనుకొని డిసైడైపొయి మా నాన నాకు పెళ్ళి చే్శాడు...అంతా అయిపొయింది బావ అని ఏడుస్తూ చెప్పింది పూజ..

అంతా అయిపొయింది .. నాకల మొత్తం చెదిరిపొయింది..నా బాదని కాసేపు ఆపుకొని తను ఏ పరిస్తితుల్లో చేసుకుందో..., ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు ..తను ఎక్కడున్న హ్యాపీ గా ఉండాలనేదే నా కోరిక..తనతో మాములుగానే మట్లాడాను..
ఫర్లేదు..పూజా.. ఇవన్ని మామూలే గా..
సరె వెళ్తాను అని చెప్పి వెల్లి్పొయింది ...
నా కన్నీల్లు..బయటకు రాకుండానే ఆగిపోయాయి.. నా మరదలు లేని ఈ జాబ్ నాకెందుకని ఈ లెటర్ ని  మావయ్య  చేతిలో పెట్టుదామని ..వాల్లింటికి బయల్దేరాను ..

భొజనం చేస్తున్న మావయ్య నన్ను చూసి "రా రా...కూర్చో" .. .. అన్నాడు..
నాకెందుకు చెప్పలేదు  మావయ్య అని అన్నాను..
సారీ రా...నిన్ను పిలుద్దామనే అనుకున్నాను... ఇప్ప్పటికైన అలస్యమేమయింది .. రా భొజనం చేద్దాం కాని..
మావయ్య నేననేది భోజనం గురించి కాదు..
మరి దేని గురించి రా అన్నడు...
పూజ కి పెల్లి చేశారు గా అన్నాను..
ఎంటీ పూజ కి పెల్లా ! దానికెవరు చేశారు..పొద్దున్నే...గుడికెల్లింది .. పెద్దమ్మ కొడుకు   వచ్చాడు గా... ఊరినించి .. ,ఈ రోజు అతని పుట్టిన రోజు అయితే గుడికెల్లారు...
అవునా నిజమా మావయ్య...మరి పెళ్ళి చేసుకున్నాను అంది..
అది పెళ్ళి  చేసుకుందంటే నువ్వెలా నమ్మావ్ రా అని అన్నాడు మావయ్య....
అది నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని ఏనాడో చెప్పింది కదరా,,,

అది నన్ను కావలనె ఏడిపించింది..... తను ఇంకా మారలేదు అని తెల్సుసుకొవడానికి నాకు ఒకనిమిషం ఆలస్యం పట్టింది...
నా కల్లల్లో ఆగిపొయిన నీరు బయటకి వచాయి..ఆనంద భాష్పాల రూపం లో...
వెల్లి తన సంగతి తెలుద్దామని బయటికి వచ్చాను...
బయటనే  ముసి ముసి గా నవ్వుతూ ఉంది ... పూజ..

ఎందుకే అబద్ధ మాడావు అన్నాను...
నువ్వేమో ఇన్నాల్లు నన్ను వదిలేసి హ్యాప్పిగ అక్కడికి  వెల్లావ్ గ ... అందుకె ఈ డ్రామా అడాను...
నీకోసం వేచి చూసి చూసి కల్లు ఎలా కాయాలు కాసాయో చూడు... అంది..
....హుం...అలా మా కథ అంతానికి   వచ్చింది .
చివరగా నీ  టెంత్ రిసల్ట్ ఎమయిందే అన్నాను...
డల్ ఫేస్ తో --- తొందరపడి పాసై పోయాను బావ అంది.. ..
నా గుండుకు సమయం ఆసన్నమయింది అని నాకు అర్థమయింది...
చివరగా నీ లక్షం ఎమిటే అని అడిగాను...
నా లక్షం ఒకటే బావ.. ఎలగో.. టెంత్   పాసైపోయాను  కదా...
ఎంసెట్ రాసి ఎం.బి.బి.ఎస్ చేసి..ఈ దేశానికి మంచి పేరు తేవాలన్నదే నా కోరిక..
హుమ్ ... ఈ సారి నాతో పాటూ ఈ దేశం మొత్తం రావలసి ఉంటదే తిరుపతికి ...... "గోవిందా ...గోవిందా"
ఇదండీ నా మరదలి కథ.. ఇంతకీ నాపేరు చెప్పలేదు కదూ... చందమామని ముద్దు గా పిలవండి , నా పేరు దొరుకుతుందీ...


****Scripted and Written By Hari*****Thank You********

(ఈ కథ పై మీ రివ్యూ ని అందించగలరని నా మనవి )







 




2 comments:

  1. బావ మరదల్ల ప్రేమకి ప్రతిరూపం నీ కధ. సూపర్.

    ReplyDelete